నందికొట్కూరు నియోజకవర్గ జనసేన నాయకుడు నల్లమల రవికుమార్, వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి బైరెడ్డికి లేదని ఆయన హెచ్చరించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, రాజకీయ మర్యాదలు పాటించాలని రవికుమార్ సూచించారు.