నందికొట్కూరు: రైతన్నా మీ కోసం వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే గిత్త

నందికొట్కూరు నియోజకవర్గం దుద్యాలలోని ఆర్‌ఎస్‌కే రైతు సేవా కేంద్రంలో బుధవారం జరిగిన "రైతన్నా మీ కోసం" వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న అగ్రిటెక్, డ్రిప్–స్ప్రింక్లర్ సేద్యం, ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ, యూనిక్ ఐడీ, యంత్రాలను రైతులకు అందించే కార్యక్రమాలను ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యంపై 100% సబ్సిడీ పునరుద్ధరించడం, మధ్యతరగతి రైతులకు సబ్సిడీని పెంచడం ద్వారా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్