కొత్తపల్లె మండలం ఎర్రమఠంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన ఆయన, సమయపాలన పాటించాలన్నారు. పడక గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.