సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ పానుగంటి చంద్రయ్య డిమాండ్ చేశారు. నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. అక్రమ కేసులు బనాయించడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.