నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, గ్రామ యూత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. యువత క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి, స్నేహభావానికి దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.