నందికొట్కూరు: నాటు సార తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు

నాటు సారా తయారుచేసి విక్రయించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు హెచ్చరించారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో నీలి షికారి పేటలో ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షికారి సుగుణ (54) మహిళ తన ఇంటిలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధం చేసిన 90 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్