గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రసాద లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నిరసనగా నందికొట్కూరులోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించినట్లు కూటమి నేతలు తెలిపారు. బీజేపీ నేత దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఈ సంఘటనపై కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు.