నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, నిరుపేదలను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించడమే P4 కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. పాములపాడు మండలం బానకచర్లలో P4 కింద నిర్మించిన నూతన గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు.