నందికొట్కూరులో IFTU నాయకులు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పటేల్ సెంటర్ వరకు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.