నందికొట్కూరు: కల్తీ లడ్డూ ప్రచారంపై వైసీపీ నేత సుధీర్ ఫైర్

తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేంకటేశ్వర స్వామిని దర్శించి క్షమాపణ కోరాలని వైసీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధారా సుధీర్ మంగళవారం డిమాండ్ చేశారు. నందికొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ, లడ్డూ కల్తీ లేదని సిట్ స్పష్టం చేసినా కావాలని ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్