నంద్యాల: నాటు సారా కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి

నంద్యాలలో నాటు సారా విక్రయదారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం అధికారులను ఆదేశించారు. 222 కుటుంబాలకు స్కిల్ డెవలప్మెంట్, మహిళలకు చేతివృత్తులు, పశుపెంపకం, తేనేటీగల పెంపకం వంటి ఉపాధి మార్గాలు చూపాలని సూచించారు. నాటు సారా వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని, పూర్తిస్థాయిలో నిర్మూలనకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్