నంద్యాల ఎస్సై మణికంఠ ప్రజలను సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వెబ్‌సైట్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకర్షణీయమైన ఆన్‌లైన్ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని, ఆశకు లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. అప్రమత్తతతో ఉంటే సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని తెలిపారు.