ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల వైసీపీ అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. "వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే"లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలను అవమానించే కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోరారు.