కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా ఖండించారు. నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.