నంద్యాల జిల్లాలో ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, ఆదివారం పోలీస్ స్టేషన్ల వారీగా రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ జరిగింది. నేర ప్రవృత్తిని విడిచిపెట్టి, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.