నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని పింఛన్లను అందించారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పథకాలను అందిస్తోందన్నారు.