శివపురంలో జిల్లా ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హార్టికల్చర్ ఆఫీసర్ చందన, పతంజలి మేనేజర్ రమణారెడ్డి మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభదాయకమని తెలిపారు. ఒక హెక్టార్కు 10,500 చొప్పున ఆయిల్ ఫామ్ పంట కాయ ఖర్చులకు, అంతర్పంట సాగు కొరకు ప్రోత్సాహకంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో VAA అరుణ్, క్రాప్ మేనేజ్మెంట్ రవళి, పిఎఫ్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.