పాములపాడు మండలంలోని మద్దూరు గ్రామంలో సుపరిపాలనలో-తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.