చెల్లిమిళ్ళలో ఇంటింటా పింఛన్ల పంపిణీ

నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలం, చెల్లిమిళ్ళ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్