ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: 100 కిట్లు పంపిణీ

నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా బొల్లవరం యూనిట్ 100 ఫ్రీ మాన్సూన్-డ్రై సోయింగ్ కిట్లను తయారు చేసి రైతులకు పంపిణీ చేసింది. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలకరి వర్షాలకు ముందు ఏప్రిల్, మే నెలల్లో విత్తన గుళికలుగా తయారు చేసి పొలాల్లో విత్తడం వల్ల తొలి వర్షాలతోనే వేగంగా మొలకలు వస్తాయని, నేలలో తేమ నిల్వ ఉండి, పంట ప్రారంభ దశలో వర్షాలపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్