నందికొట్కూరులో వైసీపీ నేతలకు, ఏబియన్ రాధాకృష్ణ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పటేల్ సెంటర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపిన ఏబియన్ రాధాకృష్ణ వర్గీయులు, వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకారులు ప్లకార్డులను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.