నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆర్ఎంపీ డాక్టర్ గీతారాణి వద్ద అబార్షన్ అనంతరం శ్రీవాణి అనే గర్భిణీ మృతి చెందింది. బీరువోలకు చెందిన శ్రీవాణికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా ఉన్నారు. పుట్టబోయే శిశువు ఆడబిడ్డ అన్న అనుమానంతో అబార్షన్ చేయించగా, చికిత్సలో నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందిందని భర్త కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.