నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి నగర్ ప్రాథమిక పాఠశాలలో భోజనశాలను ప్రారంభించారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. వి. చెంచురెడ్డి గారి జ్ఞాపకార్థంగా దాతలు ఏర్పాటు చేశారు. శుభ్రతతో కూడిన వాతావరణంలో విద్యార్థులకు భోజనం వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.