రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ నిరసన

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వైసీపీ నాయకులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందని, ప్రస్తుత సీఎం చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఉల్లి పంటకు సరైన ధర లేక రైతులు నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్