వైసీపీ నేత దార సుధీర్ షాది ఖానా భవనాన్ని పరిశీలించారు

నందికొట్కూరు పట్టణంలో నీలి షికారి పేట సమీపంలోని షాది ఖానా భవనాన్ని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దార సుధీర్ పరిశీలించారు. ముస్లిం మైనార్టీలకు అండగా వైసిపి ప్రభుత్వం 1.50 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించిందని, అయితే టిడిపి ప్రభుత్వం కమిటీల పేరుతో దీన్ని ప్రారంభించకుండా మైనార్టీలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా దీన్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జబ్బార్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, మాజీ కౌన్సిలర్ నాయబ్, తులసి రెడ్డి, భాష పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్