గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నందికొట్కూరును నాశనం చేసిన నేతలు నేడు అభివృద్ధిపై మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లు ఉందని మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి విమర్శించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయాన్ని స్మశాన వాటిక సమీపానికి తరలించే ప్రయత్నం వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను గమనించాలని సూచించారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.