నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవికృష్ణ, సుబ్బారెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు నంద్యాల జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో శివ కార్తికేయ, హర్షిత్, రషీద్ మహమ్మద్, భువన కార్తికేయ; బాలికల విభాగంలో వెంకట దీక్ష శ్రీ, పద్మ నాగ నిఖిల, ఆశ్రిత భారతి, తపస్యలు ఎంపికయ్యారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలు జూన్ నెలలో గుడివాడలో నిర్వహించబడతాయి.