నంద్యాల కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి

నంద్యాలలో బుధవారం కేసీ కెనాల్‌కు ఘనంగా జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కేసీ కెనాల్‌కు సమృద్ధిగా నీరు విడుదల కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, సాగునీటి లభ్యత పెరిగితే ప్రాంతం సుభిక్షంగా మారుతుందని ఫిరోజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్