ఆదివారం, 26 ఏప్రిల్ 2026న నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని దీ నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ మంద జావలి ఐపీఎస్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాములు, రెండో పట్టణ సీఐ, మహిళా పోలీస్ సిబ్బంది, సబ్ డివిజనల్ శక్తి టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి టీంల గురించి వివరించారు.