వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ తెలిపిన వివరాల ప్రకారం, ‘తాలీం-ఏ-హునర్’ టాలెంట్ టెస్టుకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈనెల 17న పరీక్ష జరగనుంది. ఎంపికైన టాప్-500 మంది విద్యార్థులకు IIT-JEE, NEET, EAMCET కోచింగ్‌తో పాటు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్ విద్య అందించబడుతుంది.