బనగానపల్లె: మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా కొండు భూషన్న

బనగానపల్లె మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పెద్దరాజుపల్లె గ్రామ వాసి కొండు భూషన్న నియమితులయ్యారు. వారు గతంలో నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పదవీ బాధ్యతలు అప్పగించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి విధేయులుగా ఉన్న వారికి పదవులు వాటంతట అవే వరిస్తాయని తెలిపారు. నంద్యాల జిల్లా సగర సంఘం సభ్యులు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్