నంద్యాలలో 37 మంది లబ్ధిదారులకు రూ. 16.04 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పంపిణీ చేశారు. ప్రమాదాలు, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. అత్యవసర వైద్య ఖర్చుల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు.