వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి, కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డుపై భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీపై దుష్ప్రచారం చేశారని ఆయన కల్లూరు కృష్ణానగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నారు.