నంద్యాల జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆదివారం రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరప్రవృత్తిని విడిచిపెట్టి, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని అధికారులు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కౌన్సిలింగ్ ద్వారా నేరస్థుల్లో మార్పు తెచ్చి, శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసుల లక్ష్యం.