ఈర్ణపాడు గ్రామానికి చెందిన కేత పెద్ద వెంకట సుబ్బయ్య అప్పుల బాధ తాళలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట సుబ్బయ్య మూడు ఎకరాల సొంత పొలంతో పాటు 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేసుకుంటున్నాడు. సాగు కోసం 30 లక్షల రూపాయలు అప్పు చేశాడు. పంటలో నష్టాలు రావడంతో తీర్చే దారి లేక గడ్డి మందు తాగాడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా కోలుకోలేక మృతి చెందాడు.