నంద్యాల మండలం కానాలలో రైతు అబ్బాస్‌కు చెందిన ఆవాల పంటను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో జరిగిన ఈ దుశ్చర్యతో రైతు అబ్బాస్ తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ ఘటనపై రైతు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుశ్చర్య వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.