నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న జేబీ ఎలక్ట్రానిక్స్ షాపులో శనివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులోని ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.