గోస్పాడు మండలం యాళ్లూరులో రూ. 16.40 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా శంకుస్థాపన చేశారు. "ఒక నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు" పథకంలో భాగంగా ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.