నంద్యాల పట్టణంలోని సాయి బాలాజి నర్సింగ్ హోమ్ లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, కంటి జబ్బులపై అవగాహన కల్పించడంతో పాటు, ECG, 2D Echo, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేస్తారు. ప్రముఖ వైద్యులు ఈ శిబిరంలో పాల్గొంటారు.