కర్నూలు జిల్లా పరిషత్ హాల్‌లో జరిగిన ప్రజాశక్తి దినపత్రిక 45వ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాశక్తికి పత్రికల లోకంలో విశిష్ట స్థానం ఉందని, ప్రజా సమస్యలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేస్తోందని ప్రశంసించారు. నిజాయితీతో నడిచే జర్నలిజానికి ప్రజాశక్తి ప్రతీకగా నిలుస్తోందన్నారు.