కల్లూరులో రూ. 1. 09 కోట్ల డ్రైనేజీ పనులకు భూమిపూజ

శనివారం నంద్యాల జిల్లాలోని కల్లూరు అర్బన్ 27వ వార్డు శ్రీరామ కాలనీలో రూ. 48.90 లక్షలు, 29వ వార్డు అరుణ నగర్ కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని పనులు ప్రారంభించారు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్