కమిషనర్ అండ్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ వారి ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి తనిఖీ బృందం నంద్యాలలో పురుగుమందులు ఎరువుల దుకాణాలను, విత్తన దుకాణాలను మరియు విత్తన శుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు సోమవారం చేశారు. ఈ తనిఖీలో రాష్ట్ర స్థాయి తనిఖీ బృందం సహాయ వ్యవసాయ సంచాలకులు కమలాపురం నరసింహారెడ్డి మరియు విజిలెన్స్ డిఎస్పి అనంతపురం నాగభూషణం మండల వ్యవసాయ అధికారి నంద్యాల ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.