సగర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు, వివాహ వేదికకు పిలుపు

నంద్యాల జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీకమాస వనభోజన మహోత్సవం, సగర వివాహ పరిచయ వేదికకు కంభం, కొమరోలు కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా నిర్వహిస్తున్న సగర వివాహ పరిచయ వేదికను జయప్రదం చేయాలని కంభం సగర సంఘం అధ్యక్షులు కురుకుందు వెంకటరమణ పిలుపునిచ్చారు. వనభోజన మహోత్సవాలు సగరులను సంఘటితం చేసి చైతన్యపరుస్తాయని కొమరోలు సగర సంఘం అధ్యక్షులు శ్రీరాములు అన్నారు. నంద్యాల జిల్లా సగర సంఘం నిర్వహించే వనభోజన మహోత్సవాలకు పెద్ద ఎత్తున సగరులు తరలిరావాలని కోరారు.

సంబంధిత పోస్ట్