కాశీపురం రైతుకు “మట్టి మనిషి” సేవా పురస్కారం

అవుకు మండలం కాశీపురానికి చెందిన రైతు సుధాకరరెడ్డి, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించి, స్వయంగా పొలాల్లో పనిచేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు. ఆయన సేవలను గుర్తించి, తపన సాహిత్య వేదిక 'మట్టి మనిషి' సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 21న సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్