కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం నుంచి కోడుమూరు మండలం కొత్తపల్లికి వెళ్లే దారిలో చెట్టు కింద జరుగుతున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసుల దాడులు నిర్వహించారు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో 10 మందిపై కేసు నమోదు చేయగా, వారి నుంచి రూ. 30, 150 నగదు, ఆటో, ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మికాంతరెడ్డి, అనంతయ్య, బాలప్ప, ధనుంజయ, సుంకన్న, రామకృష్ణ, గంగాధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.