కర్నూలు: తండ్రి ఆస్తి వాటా కోసం ఆత్మహత్య

తండ్రి ఆస్తిలో తన వాటా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సురేష్ (39) ఆత్మహత్య చేసుకున్నారు. మునగలపాడు నివాసి సుజ్ఞానకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు సురేష్ తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగి. తల్లి మరణానంతరం తండ్రి దగ్గరే పెరిగిన ఆయన గద్వాల గీతను వివాహం చేసుకున్నారు. కుటుంబ భారం కావడంతో తండ్రి ఆస్తిలో తన వాటా కోరగా, నిరాకరించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తాలుకా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్