నంద్యాల జిల్లాలో లారీ బీభత్సం.. వృద్ధురాలు మృతి

నంద్యాలలోని చిన్న చెరువు కట్ట దిగువన, రోడ్డుకు 20 అడుగుల దిగువన గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న కూలీల వద్దకు బుధవారం వేగంగా వచ్చిన ఐచర్ లారీ అదుపుతప్పి సుంకమ్మ అనే వృద్ధురాలి గుడిసెపై పడింది. ఈ దుర్ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్