మహానంది: తెలుగుగంగ కాలువలోకి దూసుకెళ్లిన ట్యాంకర్

నంద్యాల-గిద్దలూరు రహదారిపై గాజులపల్లె-ఆంజనేయపురం మధ్య శనివారం అర్ధరాత్రి తర్వాత ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి తెలుగుగంగ ప్రధాన కాలువలో పడిపోయింది. ట్యాంకర్ లోడుతో రాజమహేంద్రవరం వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్