మొక్కజొన్న రైతులకు మద్దతు ధర డిమాండ్‌తో నిరసన

నంద్యాలలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని సీపీఐ, ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. క్వింటాకు ₹2,400 మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం వ్యాపారులు క్వింటాకు ₹1,700 లోపు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్