సాహితీ స్రవంతి సభ్యులు ముర్తుజాకు ఘన నివాళి

అభ్యుదయ సాహిత్య ఉద్యమానికి అంకితభావంతో సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, కవి ముర్తుజా ఆదివారం నంద్యాలలో మృతి చెందారు. ఆయన మృతి సాహితీలోకానికి తీరని లోటని సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు యం.శ్రీనివాసమూర్తి తెలిపారు. ముర్తుజా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపి, అభ్యుదయ భావజాలానికి జీవితాంతం కట్టుబడి పనిచేశారని ఆయన పేర్కొన్నారు. సాహితీ స్రవంతి సభ్యులు ముర్తుజాకు ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్